ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 8, 2020, 10:45 PM IST

ETV Bharat / city

మహిళల పట్ల సమాజంలో మార్పు రావాలి: వాసిరెడ్డి

విజయవాడ స్వరాజ్ మైదానంలో నిర్వహించిన మహిళామార్చ్​ను రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రత , రక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తుందని ఆమె వెల్లడించారు.

మహిళల పట్ల సమాజంలో మార్పు రావాలి
మహిళల పట్ల సమాజంలో మార్పు రావాలి

రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రత, రక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తుందని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. విజయవాడ స్వరాజ్ మైదానంలో నిర్వహించిన మహిళామార్చ్​ను ఆమె జెండా ఊపి ప్రారంభించారు. చిన్నపిల్లలు, మహిళల పట్ల అసభ్యంగా, దుర్మార్గంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో మహిళా సాధికారత, భద్రత, రక్షణ చర్యలకు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలపై అవగాహన ర్యాలీలు, సమావేశాలను వంద రోజుల పాటు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాలు మార్చి 8న అంతర్జాతీయ దినోత్సవంతో ముగుస్తాయని ఆమె వెల్లడించారు.

బాలికలు, మహిళలు దిశ యాప్ ద్వారా వారికి జరిగే ఇబ్బందులను తెలియజేసిన వెంటనే 5 నిముషాల్లో పోలీసులు హాజరై చర్యలు తీసుకొనేలా చట్టాన్ని అమలు చేస్తున్నామన్నారు. అన్ని రంగాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రత్యేక సమస్యలపై సఖి కార్యక్రమం ద్వారా ఫిర్యాదులను స్వీకరించి అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ABOUT THE AUTHOR

...view details