ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హుండీల లెక్కింపులో చేతివాటం చూపిన ఇంటి దొంగ అరెస్ట్ - దుర్గ గుడిలో ఆభరణాల చోరీ కేసు ఛేదించిన పోలీసులు

theft case in kanaka durga temple: విజయవాడ దుర్గ గుడిలోని హుండీల లెక్కింపులో చేతి వాటం ప్రదర్శించిన ఇంటి దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆలయంలో అటెండర్​గా పనిచేస్తోన్న పుల్లారావు అనే వ్యక్తి చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

theft case in kanaka durga temple
theft case in kanaka durga temple

By

Published : May 15, 2022, 3:38 AM IST

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం హుండీల లెక్కింపులో చేతివాటం చూపిన.. ఇంటి దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 9న దేవస్థాన హుండీ లెక్కింపు సమయంలో 4 వేల నగదు, బంగారు వస్తువులను అక్కడే అటెండర్‌గా పనిచేస్తోన్న పుల్లారావు దొంగిలించారు. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు.. పుల్లారావు కదలికలను పసిగట్టి విచారించారు. ఈ క్రమంలో నేరం చేసినట్లు ఒప్పుకున్నారు. గత నెలలో రెండు సార్లు హుండీల లెక్కింపులో పాల్గొన్న పుల్లారావు.. ఆ సమయంలోనూ చేతి వాటానికి పాల్పడి రూ. 16 వేలు కాజేసినట్లు విచారణలో తేల్చారు. ఈ ఘటనలు పునరావృతం కాకుండా మరిన్ని సీసీ కెమెరాల పర్యవేక్షణ అవసరమని పశ్చిమ జోన్ డీసీపీ బాబురావు తెలిపారు. నిందితుడుని పట్టుకున్న పోలీసులను కమిషనర్ క్రాంతి రాణా అభినందించారు.

ఏం జరిగిందంటే..:విజయవాడ దుర్గగుడి హుండీల లెక్కింపులో కానుక‌లు కాజేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. దేవ‌స్థానానికి చెందిన ఓ చిరుద్యోగే ఈ ప‌ని చేసిన‌ట్టు నిర్ధరించారు. కొద్ది రోజుల కిందట మ‌హామండ‌పం ఆరో అంత‌స్తులోని బాత్‌రూంలో ఉన్న బంగారు ఆభ‌ర‌ణాల ప్యాకెట్‌ను ఎస్​పీఎఫ్​ సిబ్బంది గుర్తించారు. ఈవో ఫిర్యాదుతో రంగంలోకి దిగిన వ‌న్‌టౌన్ పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. 110మంది సేవ‌కులు, ఉద్యోగులు లెక్కింపులో పాల్గొన్నారని తెలిపారు. నిందితుడి వివరాలు త్వరలో వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:దుర్గగుడి హుండీల లెక్కింపులో కానుక‌లు కాజేసిన వ్యక్తి గుర్తింపు

ABOUT THE AUTHOR

...view details