ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇంటింటా ఓటీటీ.. థియేటర్ యజమానుల ఆదాయానికి చెల్లుచీటీ! - కొవిడ్ రెండోదశ

కరోనా వైరస్‌.. సినీ పరిశ్రమను కోలుకోలేని దెబ్బ తీసింది. లాక్‌డౌన్‌ కారణంగా మూతపడిన వెండితెర.. తిరిగి ప్రారంభం కావడానికి చాలా సమయమే పట్టింది. థియేటర్లు తెరిచినా.. పెద్ద సినిమాలు లేకపోవడంతో అంతగా స్పందన లేదు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న థియేటర్ల యజమానులకు.. కొవిడ్ నియమాలు గుది బండలా మారాయి. థియేటర్ల నిర్వహణ భారంగా మారింది. దీనికి తోడు ఓటీటీల రాకతో థియేటర్ల ఆదాయానికి తీవ్రంగా గండి పడింది.

theater owners problems
theater owners problems

By

Published : Aug 8, 2021, 6:58 PM IST

ఓటీటీ రాకతో థియేటర్‌ యజమానుల ఆదాయానికి గండి

ప్రేక్షకులకు వినోదాన్ని దగ్గర చేసే సినిమా థియేటర్ల యజమానులు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొవిడ్ రెండోదశ తర్వాత.. సినిమా హాళ్లు తెరిచినా.. పెద్ద సినిమాలేవీ లేక అరకొర వసూళ్లతోనే థియేటర్లను నడిపిస్తున్నారు. నిబంధనల ప్రకారం.. 50 శాతం సామర్థ్యంతోనే నడుస్తుండటం.. ప్రతి షోకు మధ్యలో శానిటైజ్ చేయడం కారణంగా నిర్వహణ ఖర్చు మరింత పెరిగింది. విద్యుత్ బిల్లు తగ్గించి.. వినోదపు పన్నులో రాయితీ ఇవ్వాలని థియేటర్ల యజమానులు కోరుతున్నారు.

ఓటీటీల రాకకు తోడు కరోనా భయంతో సినిమా థియేటర్లకు వచ్చేందుకు ప్రేక్షకులు అంతగా ఇష్టపడటం లేదు. ఇంట్లోనే కూర్చుని వినోదం పొందుతున్నారు. దీంతో.. డిస్టిబ్యూటర్లు, సినిమా హాళ్లలో పనిచేసే సిబ్బంది సైతం ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి కష్ట సమయంలో ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. పెద్ద హీరోల సినిమాలు రావాలని.. అప్పుడే ప్రేక్షకులతో థియేటర్లు నిండి.. లాభాలు వస్తాయని థియేటర్ల యజమానులు స్పష్టం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details