ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అమానుషం: విషం కలిపి తల్లి, చెల్లిని కడతేర్చిన కిరాతకుడు - రావల్‌కోల్‌లో తల్లి, చెల్లిని హత్య చేసిన యువకుడు

బెట్టింగ్‌లు, జల్సాలకు బానిసైన యువకుడు... తల్లీ, సోదరికి విషమిచ్చి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తెలంగాణలోని మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రావల్‌కోల్‌కు చెందిన సాయినాథ్‌రెడ్డి తండ్రి ఇటీవల మరణించాడు.

The young man  killed his mother and sister with poison at Rawalcol, Medchal district
బెట్టింగ్ వద్దన్నందుకు...విషం కలిపి తల్లి, చెల్లిని చంపేశాడు

By

Published : Nov 30, 2020, 10:46 AM IST

Updated : Nov 30, 2020, 11:54 AM IST

ఇంట్లో దాచిన డబ్బుతో క్రికెట్‌ బెట్టింగులకు పాల్పడవద్దని మందలించిన కన్నతల్లిని.. సొంత చెల్లిని పొట్టన పెట్టుకున్నాడో కిరాతకుడు.. భోజనంలో రసాయన గుళికలు కలిపి ఇద్దరినీ కడతేర్చాడు. ఈ అమానుష ఘటన ఆదివారం రాత్రి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ మేడ్చల్‌ మండలం రావల్‌కోల్‌ గ్రామానికి చెందిన ప్రభాకర్‌రెడ్డి మూడేళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో మరణించారు. అప్పటినుంచి భార్య సునీత కుమారుడు సాయినాథ్‌రెడ్డి, కుమార్తె అనూషలు కలిసి జీవిస్తున్నారు. సునీత ప్రైవేటు కంపెనీలో పనిచేస్తుండగా, సాయినాథ్‌రెడ్డి ఎంటెక్‌ చదివి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. అనూష బీఫార్మసీ చదువుతోంది.

సుమారు రూ.20 లక్షలు..

ప్రభాకర్‌రెడ్డి మృతిచెందిన సమయంలో వచ్చిన ఇన్సూరెన్స్‌ డబ్బు, భూమి అమ్మకం సొమ్ము కలిపి సుమారు రూ.20 లక్షలు బ్యాంకులో దాచారు. ఇటీవల సాయినాథ్‌రెడ్డి ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్ట్టింగ్‌లకు పాల్పడుతూ తీవ్రంగా నష్టపోయాడు. తన తల్లికి తెలియకుండా బ్యాంకు నుంచి డబ్బు డ్రా చేశాడు. ఇంట్లో ఉన్న 15 తులాల బంగారు ఆభరణాలను సైతం తీసుకెళ్లి, వాటిని అమ్మి బెట్టింగ్‌లకు పాల్పడే ప్రయత్నం చేయసాగాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లి తన కుమారుడిని నిలదీసింది. ఈనేపథ్యంలో తన తల్లిని, చెల్లిని అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు.

భోజనంలో రసాయన గుళికలు కలిపి..

ఈ నెల 23న ఇంట్లో వండిన రాత్రి భోజనంలో రసాయన గుళికలు కలిపి విధులకు వెళ్లాడు. ఈ విషయం తెలియని అమాయకపు తల్లి, చెల్లి తమకు కడుపులో తిప్పినట్లుగా ఉందని.. నువ్వు తీసుకెళ్లిన అన్నం తినవద్దని ఫోన్‌ చేసి చెప్పారు. వెంటనే ఇంటికి చేరుకున్న సాయినాథ్‌రెడ్డి వారిని అపస్మారక స్థితికి చేరే వరకు తీసుకెళ్లలేదు. తర్వాత ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ 27న అనూష, 28న సునీత మరణించారు. అంత్యక్రియల అనంతరం కుటుంబ సభ్యులు, బంధువులు సాయినాథ్‌రెడ్డిని నిలదీయగా నిజం ఒప్పుకున్నాడు. వారి ఫిర్యాదుతో ఆదివారం రాత్రి మేడ్చల్‌ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి:

మన చెరువులకు అంతర్జాతీయ గౌరవం

Last Updated : Nov 30, 2020, 11:54 AM IST

ABOUT THE AUTHOR

...view details