ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రజాశ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి మోపిదేవి - Mopidevi

వైకాపా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజా శ్రేయస్సుకు పాటుపడుతుందని మంత్రి మోపిదేవి వెంకటరమణ వ్యాఖ్యానించారు. మార్కెట్ యార్డుల గౌరవ చైర్మన్లుగా ఎమ్మెల్యేలను నియమించినప్పటికీ నిర్ణయాల్లో వారి ప్రమేయం ఉండదని తెలిపారు.

మోపిదేవి

By

Published : Aug 1, 2019, 9:26 AM IST

మోపిదేవి

రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి సమన్యాయం జరగాలని ప్రభుత్వం కొత్త చట్టాలను తీసుకువచ్చిందని మంత్రి మోపిదేవి వెంకటరమణ వ్యాఖ్యానించారు. చాలా పార్టీలు మేనిఫెస్టో ద్వారా ప్రలోభాలకు గురిచేస్తాయని... తమ ప్రభుత్వం మాత్రం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన హామీలను అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే అమలు చేస్తోందని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం మేర నామినేటెడ్ పదవులు, పనుల్లో రిజర్వేషన్లు వంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నామన్నారు. అనేక సంక్షేమ పథకాలను ప్రారంభించి ప్రజలకు లబ్ధి చేకూర్చేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మార్కెట్ యార్డుల గౌరవ చైర్మన్లుగా ఎమ్మెల్యేలను నియమించినప్పటికీ నిర్ణయాల్లో వారి ప్రమేయం ఉండదన్నారు. ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి, రైతులకు అనుసంధాన కర్తలుగా వ్యవహరిస్తారని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details