కృష్ణా జిల్లావ్యాప్తంగా 2 కార్పొరేషన్, ఐదు మున్సిపాలిటీలలో ప్రశాంతంగా ఓటింగ్ జరిగిందని... కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. 60 శాతం వరకు ఓటింగ్ జరిగిందని భావిస్తున్నట్లు వివరించారు. ఎస్ఈసీ తొమ్మిది పోలింగ్ కేంద్రాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఎక్కడా వివాదాలు లేకుండా పోలింగ్ ముగిసిందని, రీపోలింగ్ అవసరం లేదన్నారు. ఇవాళ రాత్రికల్లా బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూంలకు తరలిస్తున్నట్టు కలెక్టర్ వివరించారు. విజయవాడ లయోలా కళాశాలలో గట్టి భద్రత మధ్య భద్రపరుస్తామని, 14వ తేదీన కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ప్రశాంతంగా ఓటింగ్ జరిగింది: కలెక్టర్ ఇంతియాజ్ - Municipal Elections In Krishna District
2 కార్పొరేషన్, ఐదు మున్సిపాలిటీలలో ప్రశాంతంగా ఓటింగ్ జరిగిందని... కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. ఎక్కడా వివాదాలు లేకుండా పోలింగ్ ముగిసిందని, రీపోలింగ్ అవసరం లేదన్నారు. విజయవాడ లయోలా కళాశాలలో గట్టి భద్రత మధ్య భద్రపరుస్తామని, 14వ తేదీన కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ప్రశాంతంగా ఓటింగ్ జరిగింది: కలెక్టర్ ఇంతియాజ్