Vice President Venkaiah Naidu : సమాజంలోని అన్ని రంగాల్లో పోటీ అనివార్యమైన ప్రస్తుత పరిస్థితుల్లో.. నైపుణ్యం, క్రమశిక్షణతోనే విజయాలు సాధ్యమవుతాయని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. యువతకు దిశానిర్దేశం చేశారు. తమ రంగాల్లో నైపుణ్యాన్ని సముపార్జించుకుని, క్రమశిక్షణతో, ఇష్టపడి కష్టపడడం ద్వారా విజయాలు సాధ్యమౌతాయని సూచించారు. విజయవాడ స్వర్ణభారత్ ట్రస్ట్‌లో వివిధ వృత్తి విద్యా కోర్సులలో శిక్షణ పొందుతున్న వారిని ఉద్దేశించి ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. యువత ఉపాధి కోసం ప్రభుత్వాల మీద మాత్రమే ఆధారపడ కూడదని.. వివిధ రంగాల్లో అనేక అవకాశాలు ఎదురు చూస్తున్నాయని తెలిపారు. యువత నైపుణ్యాభివృద్ధి పొందడం వల్ల బంగారు భవిష్యత్తుతో పాటు స్వయం ఉపాధి పొందే విధంగా.. ప్రైవేట్ రంగం, స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్కిల్ ఇండియా కార్యక్రమం ద్వారా యువత అభివృద్ధికి ప్రధాన మంత్రి మోదీ.. పెద్ద పీట వేస్తున్నారని వెంకయ్యనాయుడు తెలిపారు. దీని కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసిన చొరవ అభినందనీయమని పేర్కొన్నారు.
ముగిసిన పర్యటన