రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన ఇద్దరు మంత్రులు తమ ఎమ్మల్సీ పదవులకు రాజీనామా చేయనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకటరమణలు శాసన మండలి కార్యదర్శికి రాజీనామా లేఖలు సమర్పించనున్నారు. అనంతరం ఈ లేఖలను శాసన మండలి కార్యదర్శి నేరుగా గవర్నర్కు పంపనున్నారు. ఈ రాజీనామా లేఖలను గవర్నర్ ఆమోదించిన వెంటనే మంత్రుల పోర్ట్ ఫోలియోలు రద్దు కానున్నాయి. వారు ప్రస్తుతం నిర్వహిస్తున్న శాఖలను ఇతర మంత్రులకు కేటాయించేందుకు ముఖ్యమంత్రి జగన్ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.
ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయనున్న ఇద్దరు మంత్రులు - Deputy Chief Minister Pilli Subhash Chandra Bose
రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన... మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ తమ ఎమ్మెల్సీ పదవులకు బుధవారం రాజీనామా చేయనున్నారు. ఎమ్మెల్సీ పదవుల రాజీనామాను గవర్నర్ ఆమోదించిన వెంటనే మంత్రుల పోర్ట్ ఫోలియోలు రద్దు కానున్నాయి.
ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయనున్న ఇద్దరు మంత్రులు
శాసన మండలి పదవులకు రాజీనామా చేస్తున్న విషయాన్నిమంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవిలు ముఖ్యమంత్రి జగన్కు ఇప్పటికే తెలియచేశారు. మరోవైపు అధికారికంగా ప్రమాణం చేయకపోయినా.... రాజ్యసభ సభ్యులుగా వారి పదవీకాలం మొదలైనట్టుగా రాజ్యసభ చైర్మన్ కార్యాలయం నుంచి ఇరువురికీ అధికారికంగా లేఖలు అందాయి. పార్లమెంట్ సమావేశం కాగానే రాజ్యసభలో సభ్యులుగా వారు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఇవీ చదవండి:విశాఖ సాయినార్ ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్...ఇద్దరు మృతి