ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జగన్​పై ఈడీ కేసుల విచారణ ఏప్రిల్ 1కి వాయిదా - జగన్​పై ఈడీ కేసుల విచారణ ఏప్రిల్ 1కి వాయిదా

సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నమోదు చేసిన 6 కేసుల్లోనూ విచారణ ఏప్రిల్‌ ఒకటికి వాయిదా పడింది. వీటితోపాటు ఎమ్మార్‌ వ్యవహారంలో సీబీఐ, ఈడీలు నమోదు చేసిన కేసుల విచారణ ఏప్రిల్‌ 7వ తేదీకి వాయిదా పడ్డాయి.

జగన్​పై ఈడీ కేసుల విచారణ ఏప్రిల్ 1కి వాయిదా
జగన్​పై ఈడీ కేసుల విచారణ ఏప్రిల్ 1కి వాయిదా

By

Published : Mar 25, 2021, 5:49 AM IST

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నమోదు చేసిన 6 కేసుల్లోనూ విచారణ ఏప్రిల్‌ ఒకటికి వాయిదా పడింది. రాంకీ, జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు, అరబిందో, హెటిరోలకు భూ కేటాయింపులు, పెన్నా సిమెంట్స్‌, ఇండియా సిమెంట్స్‌, ఇందూ టెక్‌జోన్‌లపై ఈడీ దాఖలు చేసిన కేసులను బుధవారం ఈడీ ప్రత్యేక హోదా ఉన్న సీబీఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి బి.ఆర్‌.మధుసూదన్‌రావు విచారణ చేపట్టారు. సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ కేసులను విచారణ చేపట్టవచ్చంటూ ఈ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసినట్లు జగతి పబ్లికేషన్స్‌ తరఫు న్యాయవాది జి.అశోక్‌రెడ్డి తెలిపారు. అయితే హైకోర్టులో పిటిషన్‌ విచారణకు ఇంకా రాలేదని న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఈ పిటిషన్‌లపై విచారణను ఏప్రిల్‌ ఒకటికి వాయిదా వేశారు.

వీటితోపాటు ఎమ్మార్‌ వ్యవహారంలో సీబీఐ, ఈడీలు నమోదు చేసిన కేసుల విచారణ ఏప్రిల్‌ 7వ తేదీకి వాయిదా పడ్డాయి. ఎమ్మార్‌పై సీబీఐ నమోదు చేసిన కేసులో ప్రధాన నిందితుడైన ఐఏఎస్‌ అధికారి బి.పి.ఆచార్య తనపై కేసు కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించగా విచారణను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పిటిషన్‌ ఇటీవల విచారణకు రాగా మధ్యంతర ఉత్తర్వులను మరో 8 వారాలపాటు పొడిగించింది.

ABOUT THE AUTHOR

...view details