హైదరాబాద్ సీబీఐ, ఈడీ కోర్టులో ఇవాళ జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. దాల్మియా కేసు విచారణకు రానందుకు ఐఏఎస్ శ్రీలక్ష్మీపై సీబీఐ కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. పెన్నా కేసులో సీబీఐ కోర్టుకు హాజరైన రిటైర్డ్ ఐఏఎస్ వెంకట్రామిరెడ్డిపై కోర్టు ఎన్‌బీడబ్ల్యూ రీకాల్ చేసింది. వాన్‌పిక్ కేసులో మోపిదేవి, బ్రహ్మానందరెడ్డి గైర్హాజయ్యారు. మోపిదేవి, బ్రహ్మానందరెడ్డి లాయర్లు రాకుంటే ఉత్తర్వులు ఇస్తామని కోర్టు హెచ్చరిచింది.
CBI-ED Case: ఐఏఎస్ శ్రీలక్ష్మిపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ - జగన్ అక్రమాస్తుల కేసు వార్తలు
ఐఏఎస్ శ్రీలక్ష్మిపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ
17:55 September 23
జగన్ అక్రమాస్తుల కేసు విచారణ
జగన్, విజయసాయి పిటిషన్లపై కౌంటర్లకు సీబీఐ, ఈడీ గడువు కోరింది. వాన్‌పిక్, దాల్మియా కేసుల విచారణ తోపాటు జగతి పబ్లికేషన్స్, పెన్నా సిమెంట్స్ కేసుల విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి
Last Updated : Sep 23, 2021, 7:57 PM IST