విజయవాడ శివారు దేవినేని గాంధీపురంలో పీతల అప్పలరాజు అనే బిల్డర్ను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. మృతదేహం అతని ఇంట్లోనే రక్తపు మడుగులో పడి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేరుకున్నారు. నిద్రిస్తున్న సమయంలోనే రాజును హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పీతల అప్పలరాజు కుటుంబం విశాఖలో ఉంటోందని పోలీసులు తెలిపారు.
విజయవాడలో దారుణం.. బిల్డర్ హత్య..! - హత్య
విజయవాడలో దారుణ హత్య జరిగింది. పీతల అప్పలరాజు అనే బిల్డర్ను గుర్తుతెలియని వ్యక్తులు అతని ఇంట్లోనే హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అయితే హత్య కేసును నున్న పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు సంఘటనా స్థలానికి చేరుకున్న విజయవాడ ఉత్తర మండల ఏసీపీ షేక్ షాను బృందం డాగ్ స్వార్డ్, క్లూస్ టీం బృందాలతో ముమ్మర దర్యాప్తు ప్రారంభించారు. ఆర్థికంగా స్థితిమంతుడైన బిల్డర్ అప్పలరాజు హత్యకు గల కారణాలపై స్థానికులను అడిగి వివరాలు సేకరించారు. సంఘటన స్ధలానికి చేరుకున్న జాగిలాలు హత్యజరిగిన ప్రాంతం నుంచి దూరంగా ఉన్నా బ్రాందీ షాపు, గృహ సముదాయాల మధ్య తిరిగింది. మద్యం సేవించి అగంతకులు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని కోణంలో సమీపంలోని సీసీ కెమెరా దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఇప్పటికే కొన్ని ఆధారాలు లభ్యమయ్యాయని ఏసీపీ తెలిపారు.
ఇదీ చదవండి:DEAD: చేపల వేటకు వెళ్లి.. ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి