రాష్ట్రంలో ప్రశ్నించే వారిని పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని వేధింపులకు గురిచేస్తున్నారని... తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు. పోలీసుల వేధింపుల వల్లే శ్రీకాకుళంలో పోలీసు స్టేషన్ భవనంపై నుంచి దూకి మాజీ సర్పంచ్ అవినాష్ ఆత్మహత్యకు యత్నించారని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రజా సమస్యలే అజెండాగా ఎన్నికలకు వెళ్తాం
ప్రజాసమస్యలు, ప్రభుత్వ మోసాలే అజెండాగా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని కళా స్పష్టం చేశారు. రాష్ట్రంలో అన్ని చోట్లా పోటీ చేస్తామన్న ఆయన.. పొత్తుల విషయంలో ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. బీసీ రిజర్వేషన్ల గురించి ప్రస్తావిస్తూ... 50 శాతం జనాభా ఉన్న బీసీలకు ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. అమరావతి రైతులకు అన్యాయం చేయటం కోసం న్యాయవాదిని నియమించిన ప్రభుత్వం రిజర్వేషన్ల అంశంపై ఎందుకు న్యాయవాదిని నియమించలేదని ప్రశ్నించారు.
ఇదీ చదవండి:
స్థానిక సంస్థల ఎన్నికలపై ఈసీ అభిప్రాయ సేకరణ