ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Liquor stores in Telangana: తెలంగాణలో డిసెంబర్‌ నుంచి నూతన మద్యం విధానం

By

Published : Nov 8, 2021, 7:22 PM IST

తెలంగాణలో డిసెంబర్‌ నుంచి నూతన మద్యం విధానం అమలులోకి రానున్నట్లు అబ్కారీ శాఖ తెలిపింది. కొత్తగా 404 మద్యం దుకాణాలు(Liquor stores in telangana) పెంచుతున్నట్లు వెల్లడించింది.

Liquor
Liquor

తెలంగాణలో కొత్తగా 404 మద్యం దుకాణాలు(Liquor stores in telangana) పెంచుతూ ఆబ్కారీ శాఖ నిర్ణయం తీసుకుంది. మద్యం దుకాణాల సంఖ్య 2,216 నుంచి 2,620కి పెంచింది. డిసెంబర్‌ నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి రానుందని ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీ, గౌడ్‌లకు దుకాణాల కేటాయింపు ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని వెల్లడించింది. గౌడ్‌లకు 363, ఎస్సీలకు 262, ఎస్టీలకు 131 దుకాణాల కేటాయించినట్లు తెలిపిన ఎక్సైజ్ శాఖ.. ఓపెన్‌ క్యాటగిరీ కింద 1,864 లిక్కర్ దుకాణాలు(Liquor stores in telangana) మిగిలాయని వెల్లడించింది. రేపటి నుంచి ఈనెల 18 వరకు దరఖాస్తుల స్వీకరించి.. ఈనెల 20న డ్రా ద్వారా కేటాయించనున్నారు.

గత రెండేళ్లల్లో మద్యం అమ్మకాల ఆధారంగా కొత్త దుకాణాలు ఏర్పాటు చేసేలా ఎక్సైజ్‌శాఖ అధికారులతో కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ సమీక్షలో ఇటీవలే చర్చించారు. అమ్మకాలు ఎక్కువ ఉన్నచోటే కొత్త దుకాణాలకు అనుమతిచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2,216 మద్యం దుకాణాలు ఉన్నాయి. కొత్తగా 404 మద్యం దుకాణాలు పెంచారు.

ABOUT THE AUTHOR

...view details