ఎంపీ రఘురామ క్వాష్ పిటిషన్ కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు - ఎంపీ రఘురామ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ
15:45 July 08
ఎంపీ రఘురామ అభ్యర్థనను తోసిపుచ్చిన తెలంగాణ హైకోర్టు
Telangana High Court dismissed MP Raghurama quash petition: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన క్వాష్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌పై దాడి ఘటనలో హైదరాబాద్ గచ్చిబౌలి పీఎస్‌లో తమపై నమోదైన కేసులను కొట్టివేయాలని రఘురామ పిటిషన్ వేశారు. రఘురామ అభ్యర్థనను తోసిపుచ్చిన న్యాయస్థానం.. క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసింది.
ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు ఆయనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులో రఘురామ కుమారుడు భరత్, పీఏ శాస్త్రి, సీఆర్‌పీఎఫ్ ఏఎస్‌ఐ, కానిస్టేబుల్‌ను నిందితులుగా చేర్చారు. విధి నిర్వహణలో భాగంగా తాను బౌల్డర్‌హిల్స్ వద్ద ఉండగా నలుగురు వ్యక్తులు వచ్చి తనను కారులో ఎక్కించుకొని రఘురామ ఇంట్లోకి తీసుకెళ్లి, చిత్రహింసలకు గురి చేశారని ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఎస్‌కే ఫరూక్ భాషా.. పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో తమపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఎంపీ రఘురామ, ఆయన కుమారుడు భరత్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది.
ఇదీ చదవండి: