కువైట్‌లో తెలుగుదేశం ప్రవాస బీమా అవగాహన కార్యక్రమం - తెదేపా వార్తలు
కువైట్‌లో ప్రవాస బీమా అవగాహన కార్యక్రమాన్ని తెదేపా కువైట్ విభాగం నిర్వహించింది. ప్రవాసాంధ్రులకు పార్టీ సభ్యత్వం కల్పించటమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెదేపా కువైట్ విభాగం అధ్యక్షుడు వెంకట్ కోడూరి తెలిపారు. రానున్న స్థానిక సంస్థల, సార్వత్రిక ఎన్నికల్లో ఈ విభాగం తెలుగుదేశం పార్టీకి సేవలందిస్తుందని పేర్కొన్నారు.
కువైట్‌లోని ప్రవాసాంధ్రులకు పార్టీ సభ్యత్వం కల్పించటమే లక్ష్యంగా తెదేపా కువైట్ విభాగం.. ప్రవాస బీమా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. పార్టీ అధిష్ఠాన ఆదేశాల మేరకు ప్రవాసాంధ్రులను బలమైన క్యాడర్‌గా చేయనున్నట్లు తెదేపా కువైట్ విభాగం అధ్యక్షుడు వెంకట్ కోడూరి తెలిపారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈ విభాగం పార్టీకి తమ సేవలనందిస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తెదేపా కువైట్ విభాగం ప్రధాన కార్యదర్శి నాగేంద్ర బాబు, తదితరులు పాల్గొన్నారు.