జస్టిస్ ఎన్‌వీ రమణతోపాటు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోని న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ గత ఏడాది అక్టోబరు 6న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బోబ్డేకి చేసిన ఫిర్యాదును సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఈ మేరకు బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘2020 అక్టోబరు 6న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సుప్రీంకోర్టుకు పంపిన ఫిర్యాదును అంతర్గత నిబంధనల ప్రకారం సంపూర్ణంగా పరీక్షించాం. తగు పరిశీలన అనంతరం దాన్ని డిస్మిస్ చేశాం. అంతర్గత నిబంధనలకు అనుగుణంగా పరిశీలించే అంశాలన్నీ గోప్యమైనవి అయినందున వాటిని బహిర్గతం చేయడం లేదు’ అని సుప్రీంకోర్టు ఈ ప్రకటనలో పేర్కొంది.
సీఎం జగన్ ఫిర్యాదును డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు - జగన్ ఫిర్యాదును డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
గత ఏడాది అక్టోబరు 6న జస్టిస్ ఎన్‌వీ రమణతోపాటు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోని న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ సీఎం జగన్..సీజేఐజస్టిస్ ఎస్‌ఏ బోబ్డేకి చేసిన ఫిర్యాదును సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది.

సీఎం జగన్ ఫిర్యాదును డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
TAGGED:
jagan suprem