వివిధ రంగాల్లో రాష్ట్రం పరిస్థితి నానాటికీ క్షీణిస్తోందని కాంగ్రెస్ నేత శైలజానాథ్ విమర్శించారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో శైలజానాథ్ మాట్లాడుతూ...అధికార, ప్రతిపక్షాలు కేవలం స్వలాభమే ప్రాతిపదికగా రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. తినడానికి తిండి, చేయడానికి పని లేని పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. రాష్ట్ర ఆదాయం 48 శాతం తగ్గిపోగా, ప్రత్యేక హోదా కోసం ప్రశ్నించేవారే లేకుండా పోయారన్నారు. నేటి తరానికి గాంధీ గొప్పతనం చాటేందుకు ఈనెల 25న నెల్లూరు నుంచి 'ముజ్ మే హై గాంధీ' కార్యక్రమం చేపడుతున్నట్లు నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ అఫ్ ఇండియా ప్రతినిధులు తెలిపారు.
'రాష్ట్రంలో పరిస్థితులు నానాటికీ క్షీణిస్తున్నాయి' - శైలజానాద్ విమర్శలు
ప్రజ సంక్షేమాన్ని గాలికొదిలేసి స్వలాభమే ప్రాతిపదికగా అధికార, ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని కాంగ్రెస్ నేత శైలజానాథ్ విమర్శించారు. వివిధ రంగాల్లో రాష్ట్రం పరిస్థితి నానాటికీ క్షీణిస్తోందన్నారు.
'రాష్ట్రం పరిస్థితి నానాటికీ క్షీణిస్తోంది'
TAGGED:
శైలజానాద్ విమర్శలు