ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాలో అభ్యంతరాలకు గడువును పొడిగిస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 2021 జనవరి 18 తేదీ వరకు ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను తెలియజేసేందుకు గడువు పొడిగిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితాలోని అభ్యంతరాలను తెలియచేసేందుకుగానూ ఈ అవకాశం కల్పిస్తూ ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది.
ఎమ్మెల్సీ ఎన్నికలు: ఓటర్ల జాబితాలో అభ్యంతరాలకు గడువు పెంపు - ECI Notification on Electrol Rolls
రాష్ట్రంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాలో అభ్యంతరాలకు గడువును పొడిగిస్తున్నట్టు ఏపీ ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఓటర్ల జాబితాలో అభ్యంతరాలకు గడువు పెంపు