వైద్యవిద్యలో ప్రవేశం పొందే విద్యార్థులకు రెండో విడత కౌన్సెలింగ్కు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మరోవైపు ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఆగస్టు 2,3 తేదీల్లో ఈడబ్ల్యూఎస్ కేటగిరిలో చేరే విద్యార్ధుల ధృవపత్రాల పరిశీలన జరుగుతుందని ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సీవీ రావు తెలిపారు. అనంతరం విద్యార్ధులు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేందుకు తేదీని ప్రకటిస్తామన్నారు. ఈడబ్ల్యూఎస్ కేటగిరికి 360 సీట్లు కేటాయించామని తెలిపారు. వీటిలో 15 శాతం చొప్పున ఆల్ ఇండియా కేటగిరి విద్యార్థులకు 53 సీట్లు లభిస్తాయని చెప్పారు. మిగిలిన 307 సీట్లతో పాటు మెుదటి కౌన్సెలింగ్లో మిగిలిపోయిన 117 సీట్లకు అనగా.. మెుత్తం 424 సీట్లకు రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు వివరించారు.
రెండో విడత మెడికల్ కౌన్సెలింగ్కు నోటిఫికేషన్ - second installment
వైద్యవిద్యలో ప్రవేశం పొందే విద్యార్థులకు రెండో విడత కౌన్సెలింగ్ కోసం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సీవీ రావు వివరాలు వెల్లడించారు.
మెడికల్ కౌన్సెలింగ్కు నోటిఫికేషన్