ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'విద్య ముసుగులో వైకాపా ఓట్ల రాజకీయాలు' - ఎమ్మెల్సీ రామకృష్ణ తాజా వార్తలు

ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన ద్వారా పిల్లలు కనిపించని ఒత్తిడికి లోనవుతారని తెదేపా ఎమ్మెల్సీ రామకృష్ణ వ్యాఖ్యానించారు. విద్య ముసుగులో వైకాపా ఓట్ల రాజకీయాలు చేస్తోందని విమర్శించారు.

ఎమ్మెల్సీ రామకృష్ణ రాజు
ఎమ్మెల్సీ రామకృష్ణ రాజు

By

Published : Feb 13, 2020, 8:28 PM IST

ఆంగ్ల మాధ్యమంపై తెదేపా ఎమ్మెల్సీ రామకృష్ణ రాజు విమర్శలు

విద్య ముసుగులో వైకాపా ఓట్ల రాజకీయాలు చేస్తోందని తెదేపా ఎమ్మెల్సీ రామకృష్ణ విమర్శించారు. అందుకే ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియం బోధనకు సిద్ధమవుతోందని ఆక్షేపించారు. ఆంగ్ల బోధన ద్వారా పిల్లలు కనిపించని ఒత్తిడికి లోనవుతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఆంగ్ల బోధనపై గగ్గోలు పెట్టిన యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఇప్పుడు ఎందుకు నోరు మెదపటం లేదని ప్రశ్నించారు. 1 నుంచి 8 వరకు తప్పనిసరిగా మాతృభాషలో బోధన అని చట్టం చెబుతున్నా... రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. ఆంగ్ల మాధ్యమం వల్ల డ్రాప్ అవుట్​లు పెరుగుతాయన్నారు.

ABOUT THE AUTHOR

...view details