రాష్ట్రాన్ని మాదకద్రవ్యాల కేంద్రంగా మార్చారని విమర్శించినందుకు చంద్రబాబుకు, లోకేశ్‌కు డీజీపీ గౌతం సవాంగ్నోటీసులివ్వడాన్ని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్రాన్ని మాదకద్రవ్యాల కేంద్రంగా మార్చారని చేసిన విమర్శలకు రాజకీయంగా అధికార పార్టీ నేతలు స్పందించాలి కానీ పోలీసులకేం సంబంధమని నిలదీశారు. జగన్ రెడ్డికి గౌతం సవాంగ్ అధికార ప్రతినిధా? లేక వైకాపా సభ్యులా? అని ప్రశ్నించారు.
మాదకద్రవ్యాల కేసులో పోలీసుల దర్యాప్తు ఏంటని రాష్ట్ర ప్రజలే డీజీపీకి నోటీసులివ్వాలని మండిపడ్డారు. డీజీపీ గౌతం సవాంగ్ పోకడ వింతగా ఉందని ఎద్దేవ చేశారు. డ్రగ్స్ సరఫరా చేసే కింగ్ పిన్ విజయవాడలో అడ్రెస్ తో సహా ఉంటే సంబంధం లేదని ఎలా అంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. "రాష్ట్రానికి డ్రగ్స్ తో సంబంధం లేదంటూ డీజీపీ ఇచ్చింది అసత్య ప్రకటనే. నోటీసులు జారీచేయటం తొందరపాటు చర్యగా భావించి వాటిని వెనక్కి తీసుకోవాలి."
-వర్ల రామయ్య, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు
ఇవీ డ్రగ్స్ మాఫియాపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు..
"రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా చెలరేగిపోతోంది. వైకాపా నేతలు డ్రగ్స్ డాన్స్, స్మగ్లింగ్ కింగ్‌లుగా మారారు. రాష్ట్రంలో నకిలీ మద్యం తయారవుతోంది. లిక్కర్ మాఫియా డబ్బు హవాలా దారిలో విదేశాలకు వెళ్తోంది. ప్రకృతి విపత్తులకు రైతులు నష్టపోతున్నా ఆదుకునేవారు కరవయ్యారు. కేంద్రం ఇచ్చే నిధులు కూడా రాష్ట్ర రైతులకు అందడం లేదు. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ ఈ నెల 31 వరకు ఆందోళనలు చేపడతాం."- చంద్రబాబు, తెదేపా అధినేత
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అసమర్థత వల్లే..