ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పార్లమెంట్​కు అంబేడ్కర్​ పేరు పెట్టాలి: గద్దర్​

నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్​కు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్​ బీఆర్​ అంబేడ్కర్​ పేరు పెట్టాలని ప్రజా గాయకుడు గద్దర్​ విజ్ఞప్తి చేశారు. ఛాయ్​ అమ్ముకునే వ్యక్తి ప్రధాని కావడమనేది మన రాజ్యాంగంలో ఉన్న గొప్పదనమని ఆయన అన్నారు. అఖిల భారత ఎస్సీ, ఎస్టీ​ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో హైదరాబాద్​ ట్యాంక్​బండ్​పై అంబేడ్కర్​ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు.

Amdedkar name to new parliament bulding
పార్లమెంట్​కు అంబేడ్కర్​ పేరు పెట్టాలి

By

Published : Jan 13, 2021, 6:15 PM IST

భారత రాజ్యాంగంలో అన్ని వర్గాల ప్రజలకు బీఆర్​ అంబేడ్కర్ సముచిత స్థానం కల్పించారని ప్రజాగాయకుడు గద్దర్​ తెలిపారు. కేంద్రప్రభుత్వం నిర్మిస్తున్న నూతన పార్లమెంట్ భవనానికి ఆయన పేరు పెట్టాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. అఖిల భారత ఎస్సీ, ఎస్టీ​ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో హైదరాబాద్​ ట్యాంక్​బండ్​పై అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు.

ఛాయ్​ అమ్ముకునే స్థాయి నుంచి దేశానికి ప్రధాని కావడం మన రాజ్యాంగంలో ఉన్న గొప్పదనమని అన్నారు. మన దేశానికి ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగాన్ని అందించిన మహానుభావుడు అంబేడ్కర్ అని కొనియాడారు. ఆయన పేరు పార్లమెంట్​కు పెట్టేలా ప్రతి ఎంపీని కలవనున్నట్లు వెల్లడించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్రంపై ఒత్తిడి పెంచేలా కృషి చేస్తామని గద్దర్​ తెలిపారు. ఈ డిమాండ్​ను కేంద్రం అంగీకరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతామని సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్వర్ రాజ్ హెచ్చరించారు.

ఇదీ చూడండి :పందెం కోళ్లకు బ్రహ్మచర్యం తప్పదా?!

ABOUT THE AUTHOR

...view details