విద్యార్థులకు ఆంగ్ల భాషపై బ్రిడ్జి కోర్సు నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ పాఠ్యాంశాలను సిద్ధం చేస్తోంది. కోర్సును మార్చిలో ప్రారంభించి ఏప్రిల్ వరకు నిర్వహించేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. అవసరమైతే ప్రాథమిక స్థాయిలో నిర్వహించే పరీక్షల షెడ్యూల్లోనూ మార్పులు చేయాలని యోచిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయిలో 20 లక్షల వరకు విద్యార్థులున్నారు. వీరిని రెండు గ్రేడ్లుగా విభజించి... తరగతులు నిర్వహించనున్నారు. ఆంగ్లం మాట్లాడటం, అర్థం చేసుకోగలుగుతున్న వారిని ఒక బృందంగా ఏర్పాటు చేయనున్నారు. వీరికి 39 రోజులు బ్రిడ్జి కోర్సు నిర్వహించనున్నారు. రోజుకు 4గంటలు బోధిస్తారు.
ఆంగ్లంపై పట్టుకు సినిమాలు ప్రదర్శన