ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'భావి భారత నిర్మాణంలో ఉపాధ్యాయులు, విద్యార్థులదే కీలకపాత్ర' - భావి భారత నిర్మాణంలో ఉపాధ్యాయులు, విద్యార్థులదే కీలకపాత్ర: గవర్నర్

భావి భారత నిర్మాణంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల పాత్రే కీలకమని రాష్ట్ర గవర్నర్​ భిశ్వభూషణ్​ అన్నారు. పావని సేవా సమితి నేతృత్వంలో రూపుదిద్దుకున్న మహాభారతం, రామాయణం, భగవద్గీత పురాణ ఆధ్యాత్మిక పుస్తకాలను గవర్నర్ రాజ్ భవన్ దర్బార్ హాలులో ఆవిష్కరించారు.

the-mahabharata-ramayana-and-bhagavad-gita-mythological-books-reased-in-the-hall-of-governor-raj-bhavan-darbar-hall
పురాణ ఆధ్యాత్మిక పుస్తకాలను ఆవిష్కరించిన గవర్నర్ హరిచందన్

By

Published : Dec 15, 2019, 12:00 AM IST

చిన్నారుల్లో నైతికతను పెంపొందించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు. భావి భారత నిర్మాణంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు గొప్ప భూమిక పోషిస్తున్నారని...ఉపాధ్యాయులు రామాయణం, మహాభారతం, భగవద్గీత వంటి ఇతిహాసాల్లోని నీతి, నైతికతలను విధ్యార్ధులకు బోధించాలని సూచించారు. విజయవాడ పావని సేవా సమితి నేతృత్వంలో రూపుదిద్దుకున్న మహాభారతం, రామాయణం, భగవద్గీత పురాణ ఆధ్యాత్మిక పుస్తకాలను గవర్నర్ రాజ్ భవన్ దర్బార్ హాలులో ఆవిష్కరించారు.

పావని సేవా సమితి కృషి అభినందనీయం

జీవిత సారాన్ని మనకు నేర్పించే భగవద్గీత భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల విశ్వవిద్యాలయాలలోనూ పాఠ్యాంశాల్లో చేర్చారని గవర్నర్​ పేర్కొన్నారు. స్వాతంత్ర్యానంతరం భారతదేశంలో రామ రాజ్యం రావాలని మహాత్మా గాంధీ కలలు కన్నారని.. కానీ రామాయణం అంటే ఏమిటో తెలియకుండా మనం రామ రాజ్యాన్ని ఎలా సాధించగలమని గవర్నర్ అన్నారు. మహాభారతంలో కర్ణుడి పాత్రపై అభిసప్తా కర్ణ అనే పేరుతో ఒడియాలో తాను ఒక పుస్తకం రాశానని హరిచందన్ తెలిపారు. శాంతి నికేతన్‌లో విభాగాధిపతిగా పనిచేసిన తన సోదరుడు డాక్టర్ నీలాద్ భూసన్ హరిచందన్ మహాభారత ఇతిహాసంపై అనేక పుస్తకాలు రాశారని ఆయన గుర్తు చేసుకున్నారు. రామాయణం, మహాభారతం, భగవద్గీత మొదలైన ఇతిహాస పుస్తకాలను తీసుకురావడంలో పావని సేవా సమితి చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. విద్యార్ధులకు సులభంగా అర్థం అయ్యే రీతిలో వీటి రూపకల్పన జరిగిందని... తిరుమల తిరుపతి దేవస్ధానం ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. వీటిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఉపాధ్యాయులకు ఉచితంగా పంపిణీ చేయనున్నారని, పురాణ ఆధ్యాత్మిక పుస్తకాలను ప్రచురించడంలో తితిదే అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని సుబ్బారెడ్డి వివరించారు.

ఇవీ చదవండి:

ఈనెల 16, 17 తేదీల్లో విజయవాడలో చేనేత వస్త్ర ప్రదర్శన

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details