ప్రజల ప్రాణాలంటే ముఖ్యమంత్రి జగన్‌కు లెక్కలేకుండా పోయిందని మాజీమంత్రి అయన్నపాత్రుడు ట్వీటర్ వేదికగా విమర్శించారు. క్వారెంటైన్లో అద్భుతమైన వసతులు కల్పించామని చెబుతున్నా... అక్కడి అధ్వాన పరిస్థితిని చూసి బాధితులు వాపోతున్నారని వివరించారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న క్వారెంటైన్లో జబ్బు తగ్గటం దేవుడెరుగు... కొత్త వ్యాధులు వచ్చేంత చెండాలంగా నిర్వహణ ఉందని మంత్రిని నిలదీసే పరిస్థతి వచ్చిందన్నారు. వైకాపా ప్రభుత్వానికి ఎన్నికలపై ఉన్న ప్రేమ ప్రజలపై లేకపోవటమే పెను ప్రమాదానికి కారణం అవుతుందన్నారు.
'ప్రజల ప్రాణాలంటే ముఖ్యమంత్రికి లెక్కలేకుండా పోయింది' - అయ్యన్నపాాత్రుడు న్యూస్
వైకాపా ప్రభుత్వం కరోనా వైరస్‌పై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ట్వీటర్ వేదికగా విమర్శించారు. ప్రజల ప్రాణాలంటే ముఖ్యమంత్రి జగన్‌కు లెక్కలేకుండా పోయిందన్నారు.
అయ్యన్నపాత్రుడు ట్వీట్