KRMB MEET: యాసంగి సీజన్లో తెలుగు రాష్ట్రాల సాగు, తాగునీటి అవసరాసలపై చర్చించేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ వచ్చేవారంలో భేటీ కానుంది. ఈ నేపథ్యంలో రబీ సీజన్ సాగు, తాగునీటి అవసరాలకు సంబంధించిన వివరాలు పంపాలని రెండు రాష్ట్రాలను కృష్ణా బోర్డు కోరింది.
KRMB MEET: త్వరలో కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ భేటీ.. నీటివాటాలపై చర్చ - Krishna River management Board Committee
KRMB MEET: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ వచ్చే వారం సమావేశం కానుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల యాసంగి సీజన్ సాగునీటితో పాటు తాగునీటి అవసరాల కోసం నీటి విడుదల అంశంపై సమావేశంలో చర్చించనుంది.
![KRMB MEET: త్వరలో కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ భేటీ.. నీటివాటాలపై చర్చ త్వరలో కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ భేటీ.. నీటివాటాలపై చర్చ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14249822-110-14249822-1642792835862.jpg)
త్వరలో కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ భేటీ.. నీటివాటాలపై చర్చ
letters to ENCS: ఈ నెల 24వ తేదీ వరకు వివరాలు ఇవ్వాలని కోరుతూ కేఆర్ఎంబీ సభ్యకార్యదర్శి రాయిపురే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీలకు ఇప్పటికే లేఖలు రాశారు. రెండు రాష్ట్రాల నుంచి వివరాలు అందాక తేదీ ఖరారు చేసి త్రిసభ్య కమిటీ సమావేశమవుతుందని తెలిపారు.
ఇవీ చూడండి: