ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేయాలని ఎస్ఈసీని ఆదేశించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున పిటిషన్ దాఖలు చేసినట్టు పేర్కొన్నారు. తమ పిటిషన్ను హైకోర్టు స్వీకరించి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతుందని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. గత ఎన్నికల ప్రక్రియలో ప్రభుత్వం ఎన్నో అవకతవకలకు పాల్పడిందని ఆరోపించారు. అందువలన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు మనోహర్ పేర్కొన్నారు. కొత్తగా నోటిఫికేషన్ ఇస్తేనే ప్రజాస్వామ్యాన్ని బతికించినట్లవుతుందని అన్నారు. ఈ సందర్భంగా యువతకు భవిష్యత్తులో ఎక్కువగా అవకాశాలు రావాలని చెప్పారు.
'కొత్తగా నోటిఫికేషన్ ఇస్తేనే ప్రజాస్వామ్యాన్ని బతికించినట్లవుతుంది'
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేయాలని.. ఎస్ఈసీని ఆదేశించాలంటూ జనసేన పార్టీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ విషయాన్ని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. కొత్తగా నోటిఫికేషన్ ఇస్తేనే ప్రజాస్వామ్యాన్ని బతికించినట్లవుతుందని ఆయన పేర్కొన్నారు.
పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించి.. రాష్ట్రమంతా ఏకగ్రీవాలు చేసేందుకు పిలుపునిచ్చిందని విమర్శించారు. ఎన్నికలు అనివార్యమైన చోట వాలంటీర్లను ఇంటింటికీ పంపించి.. వైకాపాకు ఓటు వేయనట్లైతే సంక్షేమ పథకాలు అందకుండా చేస్తామని బెదిరింపులకు పాల్పడినట్లు మనోహర్ పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి ఎన్నికలు చూడలేదని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు, మంత్రులు గ్రామాల్లో తిష్టవేసి మరీ ప్రయత్నాలు చేశారని ఎద్దేవా చేశారు. జనసేన పార్టీ మాత్రం పంచాయితీ ఎన్నికలను ఓ అద్భుత అవకాశంగా భావించిందని తెలిపారు. ఎక్కడ ఏకగ్రీవాలు జరగకూడదని పవన్ కల్యాణ్ పిలుపు మేరకు వార్డు, సర్పంచ్ స్థానాల్లో జనసైనికులు పెద్ద ఎత్తున పోటీ చేశారని మనోహర్ పేర్కొన్నారు.