ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: నిండుకుండలా హుస్సేన్‌సాగర్..కొనసాగుతున్న వరద - hussain sagar latest information

విరామం లేకుండా కురుస్తోన్న భారీ వర్షాలకు హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ జలకళను సంతరించుకుంది. జలాశయ నీటిమట్టం పూర్తిస్థాయికి చేరుకోవటంతో నిండుకుండను తలపిస్తోంది. జలాశయానికి 1560 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. అంతకంటే ఎక్కువ నీటిని దిగువకు వదులుతున్నారు.

హుస్సేన్ సాగర్
హుస్సేన్ సాగర్

By

Published : Oct 20, 2020, 5:21 PM IST

హుస్సేన్‌సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. ట్యాంక్‌బండ్‌లోకి వరద నీరు భారీగా చేరుతోంది. హుస్సేన్‌సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 513.41 మీటర్లుకాగా.. 513.67 మీటర్లకు చేరింది. జలాశయంలోకి 15వందల 60 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. తూముల ద్వారా 2వేల 98 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. హుస్సేన్‌సాగర్‌ వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు.

హుస్సేన్ సాగర్

ABOUT THE AUTHOR

...view details