ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

చంద్రబాబు ఇంటి వద్ద దాడి... నేతలకు హైకోర్టులో ఊరట - హైకోర్టు వార్తలు

తెదేపా అధినేత చంద్రబాబు(TDP chief Chandrababu) ఇంటి వద్ద జరిగిన దాడి(attack) ఘటనలో హైకోర్టులో(high court) తెదేపా నేతల(tdp leaders)కు ఊరట లభించింది. పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని తేదేపా నేతలు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్​పై వాదనలు విన్న హైకోర్టు.. పిటిషనర్లకు 41 సీఆర్ పీసీ నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది

High Court
High Court

By

Published : Sep 23, 2021, 3:28 PM IST

తెదేపా నేతలకు హైకోర్టులో ఊరట లభించింది. తెదేపా అధినేత చంద్రబాబు (TDP chief Chandrababu) ఇంటి వద్ద జరిగిన దాడి ఘటనలో తాడేపల్లి పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని తేదేపా నేతలు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు , అధికార ప్రతినిధి పట్టాభి తదితరులు హైకోర్టులో(high court) క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్ డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పిటిషనర్లపై ఎస్టీ,ఎస్సీ కేసు నమోదు చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అతన్ని ఇంతకు ముందు చూడలేదని ధర్మాసనానికి తెలిపారు. పోలీసులు పిటిషనర్లపై అన్యాయంగా కేసు నమోదు చేశారన్నారు. వాదనలు విన్న న్యాయస్థానం ..ఏడేళ్ల లోపు శిక్ష ఉన్న సెక్షన్లు కావున.. పిటిషనర్లకు 41 సీఆర్ పీసీ నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. నోటీసులిచ్చి నిబంధనల ప్రకారం నడుచుకోవాలని పోలీసులకు ఆదేశాలిచ్చింది.

ABOUT THE AUTHOR

...view details