High Court: సీఎస్, డీజీపీకి హైకోర్టు నోటీసులు.. మహిళా కార్యదర్శులకు పోలీసు విధులు ఎలా ఇస్తారు?
11:31 October 26
మహిళా కార్యదర్శులుగా నియమించి పోలీసు విధుల అప్పగింతపై అభ్యంతరం
గ్రామ సచివాలయాల్లోని.. మహిళా కార్యదర్శులకు పోలీసు విధులు ఎలా ఇస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని హైకోర్టు(High Court) ప్రశ్నించింది. గ్రామ సచివాలయాల్లో మహిళా కార్యదర్శుల్నిపోలీసులుగా నియమించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్ట్ విచారణ జరిపింది. ఈ నియామకాలు 1859 ఏపీ డిస్ట్రిక్ట్ పోలీస్ చట్టానికి విరుద్ధమని.. పిటిషనర్ తరపున్యాయవాది వాదించారు. సివిల్ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోరాదంటూ.. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా వ్యవహరించారని పేర్కొన్నారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు, డీజీపీ, హోంశాఖ కార్యదర్శి, పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు, ఏపీపీఎస్సీ(APPSC) ఛైర్మన్‌కు హైకోర్టు నోటీసులిచ్చింది. వారి వాదన పరిశీలించాక మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని తెలిపింది.
ఇదీ చదవండి:
RATION DEALERS: రాష్ట్రవ్యాప్తంగా రేషన్ డీలర్ల ధర్నా..జీవో నెం.10 రద్దు చేయాలని డిమాండ్