రాష్ట్రంలోని దాదాపు 7 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితుల ఖాతాల్లో మంగళవారం రూ.666.84 కోట్లు జమ చేయనున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. రూ.10వేలలోపు డిపాజిట్ చేసిన 3.86 లక్షల మంది బాధితులకు రూ.207.61 కోట్లు, రూ.10వేల నుంచి రూ.20 వేలలోపు డిపాజిట్ చేసిన 3.14 లక్షల మంది బాధితులకు రూ.459.23 కోట్లను చెల్లించనున్నట్లు వెల్లడించింది.
7 లక్షల మంది అగ్రి గోల్డ్ బాధితుల ఖాతాల్లో నేడు నగదు జమ - నేడు అగ్రి గోల్డ్ బాధితులకు నగదు చెల్లించనున్న ప్రభుత్వం
18:06 August 23
అగ్రి గోల్డ్ బాధితులకు నగదు చెల్లించనున్న ప్రభుత్వం
సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని వివరించింది. 2019 నవంబరులో 3.40 లక్షల మంది బాధితులకు రూ.238.73 కోట్లు ఇచ్చామని.. ఆ మొత్తాన్నీ కలిపితే ఇప్పటివరకూ 10.40 లక్షల మంది బాధితులకు రూ.905.57 కోట్లు చెల్లించినట్లవుతుందని తెలిపింది. హైకోర్టు ఆదేశాల మేరకు... వాలంటీర్లు, సచివాలయాల ద్వారా బాధితుల్ని గుర్తించి, సీఐడీ ద్వారా నిర్ధారించి చెల్లింపులు జరుపుతున్నట్లు వెల్లడించింది.
అగ్రిగోల్డ్ భూముల్ని ప్రభుత్వమే అమ్మించి.. తనకు రావాల్సిన సొమ్ము తీసుకుని మిగతాది డిపాజిట్‌దారులకు ఇవ్వనున్నట్లు వివరించింది. రూ.20వేలలోపు డిపాజిట్ చేసిన బాధితుల సంఖ్యను రూ.8.79 లక్షల మందిగా తేల్చిన గత ప్రభుత్వం వారికి రూ.785 కోట్లు చెల్లించాలని నిర్ధారించిందని, అయినా ఒక్క రూపాయీ ఇవ్వలేదని పేర్కొంది.
ఇదీ చదవండి:
HC: ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి ఆగ్రహం.. రెండు వారాల్లో బిల్లులు చెల్లించాలని ఆదేశం