ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'కరోనా తిరగబెట్టొచ్చు అందుకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేం' - స్థానిక సంస్థల ఎన్నికలపై మేకపాటి కామెంట్స్

కరోనా నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఆలోచన ప్రస్తుతం ప్రభుత్వానికి లేదని పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. బిహార్ ఎన్నికలు కచ్చితంగా జరగాల్సిన రాష్ట్ర ఎన్నికలు కాబట్టే నిర్వహిస్తున్నారని...వాటితో స్థానిక సంస్థల ఎన్నికలను పోల్చకూడదన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఆలోచన ప్రభుత్వానికి లేదు
స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఆలోచన ప్రభుత్వానికి లేదు

By

Published : Oct 23, 2020, 3:35 PM IST

Updated : Oct 23, 2020, 5:28 PM IST

స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఆలోచన ప్రస్తుతం ప్రభుత్వానికి లేదని పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు. నవంబరు, డిసెంబరు నెలల్లో మరోసారి కరోనా వైరస్ వ్యాప్తి జరిగే అవకాశం ఉందని హెచ్చరికలు ఉన్నాయన్నారు. దసరా తరువాత రెండో మారు విజృంభించే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారని వెల్లడించారు. బిహార్ ఎన్నికలు కచ్చితంగా జరగాల్సిన రాష్ట్ర ఎన్నికలు కాబట్టే నిర్వహిస్తున్నారని...వాటితో స్థానిక సంస్థల ఎన్నికలను పోల్చకూడదన్నారు.

కరోనా తిరగబెట్టొచ్చు అందుకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేం
Last Updated : Oct 23, 2020, 5:28 PM IST

ABOUT THE AUTHOR

...view details