ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఆరోగ్య సేతు' ఉంటేనే సచివాలయంలోకి ఎంట్రీ - aarogya setu app latest news

secratariat-breaking
secratariat-breaking

By

Published : Jun 5, 2020, 6:42 PM IST

Updated : Jun 6, 2020, 3:49 AM IST

18:38 June 05

రాష్ట్ర సచివాలయంలో విధులు నిర్వహించే ఉద్యోగులకు, సచివాలయానికి వచ్చే సందర్శకులకు ఆరోగ్యసేతు యాప్​ను తప్పని సరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర సచివాలయంలో ప్రవేశించేవారు 'ఆరోగ్య సేతు' యాప్ కలిగి ఉండాలని... లేకపోతే లోపలకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. సచివాలయంలో విధులు నిర్వహించే ఉద్యోగులు, సందర్శకుల మొబైల్ ఫోన్​లో ఈ యాప్​ తప్పనిసరిగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ  మేరకు సచివాలయ ముఖ్య భద్రతా అధికారి దీనిపై చర్యలు తీసుకోవాలని తెలిపింది. సచివాలయ బ్లాక్​ల్లో ప్రవేశానికి ముందు థర్మల్ స్కానింగ్, శానిటైజేషన్ చేసుకోవాలని సూచించింది. ఈ యాప్​లో ప్రమాద సూచిక వస్తే సదరు ఉద్యోగికి వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వం పేర్కొంది.

ఇదీ చూడండిం: 'గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇసుక బుకింగ్'

Last Updated : Jun 6, 2020, 3:49 AM IST

ABOUT THE AUTHOR

...view details