Water Tax: ‘నీటి తీరువా (నీటి పన్ను) వసూళ్లను మార్చి నాటికి వందకు వంద శాతం పూర్తి చేయాలి. గ్రామ, మండల, జిల్లా స్థాయి బృందాల ద్వారా ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగాలి’ అని ప్రభుత్వం నుంచి జిల్లాలకు ఆదేశాలు జారీ అయ్యాయి. వీటికి అనుగుణంగా జిల్లాల్లో సమీక్షలు, వసూళ్లకు కార్యాచరణ సిద్ధమవుతోంది. నీటి తీరువా చెల్లించని వారి వివరాలను సర్వే నంబర్ల ఆధారంగా ఆన్‌లైనులో మ్యాపింగ్ చేస్తున్నారు. ఎకరానికి ఖరీఫ్‌లో రూ.200, రబీలో రూ.150 చొప్పున నీటి తీరువా కింద రైతులు చెల్లించాలి. వీటిని నవంబరు/డిసెంబరు, మార్చి/ఏప్రిల్‌లో వసూలు చేస్తుంటారు. వివిధ కారణాలతో రైతుల్లో కొందరు కొన్నేళ్ళుగా నీటి తీరువా చెల్లించడం లేదు. ఇలాంటి వారి నుంచి ఇప్పటికే అమలులో ఉన్న నిబంధన ప్రకారం ఏడాదికి 6శాతం జరిమానా వసూలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో చిన్న రైతులు చెల్లించాల్సిన మొత్తం కంటే వడ్డీ ఎక్కువగా ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఆందోళనలో రైతులు..