బ్రాహ్మణ కార్పొరేషన్‌ను దేవదాయశాఖ నుంచి తప్పించిన ప్రభుత్వం - the-government-expelled-the-brahmin-corporation-from-the-devadaisakha
21:07 September 23
bramana
బ్రాహ్మణ కార్పొరేషన్‌ను దేవాదాయశాఖ నుంచి తప్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెరుగైన సమన్వయం కోసం బ్రాహ్మణ కార్పొరేషన్‌ను బీసీ సంక్షేమ శాఖ పరిధిలోకి తీసుకువస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు ఇచ్చారు.
బ్రాహ్మణ కార్పొరేషన్‌ను ఆర్థికంగా వెనుకబడిన కార్పోరేషన్ల పరిధిలోకి తీసుకురావటం వల్ల సంస్థల మధ్య మరింతగా మెరుగైన సమన్వయం సాధించేందుకు అవకాశముంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మార్పు కోసం ఏపీ ప్రభుత్వ బిజినెస్ నిబంధనల్లో మార్పులు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీని కోసం తగిన చర్యలు చేపట్టాల్సిందిగా దేవాదాయశాఖను, వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖలను ప్రభుత్వం ఆదేశించింది.
ఇదీ చదవండి:రాష్ట్రవ్యాప్తంగా 4 అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల పరిధి పెంపు