ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

భవిష్యత్తంతా.. టెక్‌దే.. 80% కొత్త ఉద్యోగాలు అందులోనే! - Jobs in IT sectors news

భవిష్యత్తులో ఐటీ రంగంలో టెక్నాలజీ హవా కొనసాగనుంది. కరోనా కారణంగా ఈ రంగంలో కొంత స్తబ్దత నెలకొన్నా.. ఆర్థిక వ్యవస్థ మెరుగైన తరువాత 80 శాతం కొత్త ఉద్యోగాలు ఈ రంగంలోనే రానున్నాయి. దేశంలో ‘భవిష్యత్తు నైపుణ్యాల ప్రతిభ - డిమాండ్‌, సరఫరాలో వ్యత్యాసం’పై అధ్యయనం జరిపిన.. నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీస్‌ కంపెనీస్‌(నాస్కామ్‌) ఇటీవల ఆ నివేదికను విడుదల చేసింది.

భవిష్యత్తంతా.. టెక్‌దే.. 80% కొత్త ఉద్యోగాలు అందులోనే!
భవిష్యత్తంతా.. టెక్‌దే.. 80% కొత్త ఉద్యోగాలు అందులోనే!

By

Published : Oct 31, 2020, 10:17 AM IST

ఐటీ రంగంలో భవిష్యత్తులో గిరాకీ మేరకు మానవ వనరులను సిద్ధం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నైపుణ్య శిక్షణను ప్రారంభించాలని నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీస్‌ కంపెనీస్‌(నాస్కామ్‌) సూచించింది. 2024 నాటికి ఎంట్రీలెవల్‌ ఉద్యోగాల్లో భారతీయ యువత పాగావేసేందుకు నైపుణ్యాలతో సిద్ధం కావాలని, ఈ ఉద్యోగాల్లో 50 శాతం ఉద్యోగాలకు ధ్రువీకరణ పత్రాలు అవసరమని పేర్కొంది. దేశంలో భవిష్యత్తు నైపుణ్యాలు కలిగిన నిపుణుల కొరత ఎక్కువగా ఉందని, ఇప్పటికిప్పుడు అంచనాలను పరిశీలిస్తే గిరాకీ 8 రెట్లు అధికంగా ఉందని తెలిపింది. ఈ డిమాండ్‌ 2024 నాటికి 20 శాతానికి చేరుకోనుందని వివరించింది.

12-13 లక్షల మందికి ఉద్యోగాలు

నాస్కామ్‌ నివేదిక ప్రకారం.. డిజిటల్‌ టెక్నాలజీ రంగంలో 2024 నాటికి దాదాపు 12-14 లక్షల మందికి ఉద్యోగాలు లభించే అవకాశాలున్నాయి. బెంగళూరు, దిల్లీ, ముంబయి, పుణె, హైదరాబాద్‌, చెన్నై నగరాల్లో టెక్నాలజీలో ఉద్యోగాల వృద్ధి రేటు 19-30 శాతానికి చేరుకోనుంది. దేశవ్యాప్తంగా 11-13 స్టార్టప్‌లు ఈ రంగంలో ఎక్కువ ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నాయి. భవిష్యత్ అవసరాలు, డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు నైపుణ్య శిక్షణ అందించడంతో పాటు కొత్త టెక్నాలజీ రంగాల్లోనూ పెట్టుబడులు పెడుతున్నాయి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details