తెలంగాణ రాష్ట్రం హనుమకొండ జిల్లాలోని జేఎన్ఎస్ మైదానంలో జాతీయస్థాయి అథ్లెటిక్ పోటీలు (national level athletics competition) ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగుతున్నాయి. క్రీడకారులు నువ్వా.. నేనా అన్నట్లు తలపడుతున్నారు. అయితే ఈ క్రీడ పోటీలలో వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన క్రీడకారులు పోటీలలో పాల్గొని పతకాలను సాధిస్తున్నారు. క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ తమ సత్తాను చూపెడుతూ ప్రతిభను చాటుకుంటున్నారు.
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన పారుల్ చౌదరి రెండు బంగారు పతకాలు అందుకుంది. ఉత్తర్‌ప్రదేశ్ మీరట్‌కు చెందిన పారుల్ చౌదరి 5000, 3000 మీటర్ల పరుగులో విజేతగా నిలిచారు. ఆమె తండ్రి రిషిపాల్ ఒక రైతు. ‘రోజూ అథ్లెటిక్స్‌లో ప్రాక్టీస్ చేసేందుకు 20 కిలోమీటర్ల దూరం వెళ్లాను. మా ప్రాంతంలో ఓ అమ్మాయి ఆటలు ఆడేందుకు ఎన్నో ఇబ్బందులు. క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ రైల్వేస్ తరఫున ఈ పోటీల్లో పాల్గొన్నాను.’ అని పారుల్ చౌదరి చెప్పారు.