ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఈ నెల 26న కాంగ్రెస్​ తొలి రాష్ట్ర కమిటీ సమావేశం - state committee meeting of the Congress

ఈ నెల 26న విజయవాడలో కాంగ్రెస్​ తొలి రాష్ట్ర కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి నూతనంగా ఎంపిక చేసిన 11 మంది ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కో-ఆర్డినేషన్ కమిటీ సభ్యులు పాల్గొంటారని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్హై దరాబాద్ ఇందిరా భవన్​లో చెప్పారు

The first state committee meeting of the Congress on 26th of this month
ఈ నెల 26న కాంగ్రెస్​ తొలి రాష్ట్ర కమిటీ సమావేశం

By

Published : Feb 23, 2020, 5:40 AM IST

ఈ నెల 26న విజయవాడలో తొలి రాష్ట్ర కమిటీ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ తెలిపారు. ఈ సమావేశానికి నూతనంగా ఎంపిక చేసిన 11 మంది ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కో-ఆర్డినేషన్ కమిటీ సభ్యులు పాల్గొంటారని శైలజానాథ్ హైదరాబాద్ ఇందిరా భవన్​లో చెప్పారు. యువతకు, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు సామాజిక న్యాయం పాటించనున్నట్లు శైలజానాథ్​ తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం శ్రమించిన వారు చాలామంది ఉన్నారని వారిని గుర్తించి... ఇంకా మిగిలిన పోస్టుల నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ ఆదేశాల మేరకు... కలిసి కట్టుగా పనిచేసి ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తామన్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ ప్రజా సంక్షేమానికి దూరంగా పని చేస్తుందని... దీనిని నిలదీయాల్సిన ప్రతిపక్షమూ పూర్తి విఫలమైందని శైలజానాథ్ విమర్శించారు.

మాట్లాడుతున్న రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్

ఇదీ చదవండి :'డ్రోన్ ద్వారా పరిశీలించడం కొత్తేం కాదు'

ABOUT THE AUTHOR

...view details