వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన పాదయాత్ర(YS Sharmila Padayatra 202) ఐదో రోజు కొనసాగుతోంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామం నుంచి కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఈ యాత్రలో వైఎస్సార్ అభిమానులు పాల్గొన్నారు. పాదయాత్ర(YS Sharmila Padayatra 202) సందర్భంగా ఆమెకు వైవీ సుబ్బారెడ్డి సంఘీభావం తెలిపారు.
షెడ్యూల్ ఇదే..
కొత్త తండా క్రాస్ రోడ్డు, దగ్లిగూడా క్రాస్, మానసపల్లి చౌరస్తా మీదుగా.. మానసపల్లి గ్రామానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు భోజనం చేసి కాసేపు విరామం తీసుకున్నారు. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మానసపల్లి నుంచి పాదయాత్ర(YS Sharmila Padayatra 202) ప్రారంభించి.. కొత్వాల్ చెరువు తండా క్రాస్, మహేశ్వరానికి చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు.
నాలుగో రోజు ఇలా..
నాలుగో రోజు సందర్భంగా.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పోశెట్టిగూడ క్రాస్ రోడ్లో ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైన యాత్ర.. మధ్యానానికి గొల్లపల్లి, రషీద్‌గూడ, హామీదుల్లానగర్కు చేరుకుంది. 12 గంటలకు భోజనం చేసి స్వల్ప విరామం తీసుకున్న షర్మిల.. హామీదుల్లానగర్ నుంచి చిన్నగోల్కొండ గ్రామం, బహదూర్ గూడ క్రాస్ , పెద్దగోల్కొండ, మహేశ్వరం మండలంలోని నాగారం గ్రామానికి చేరుకుని రాత్రి అక్కడే బస చేశారు.