నిబంధనలకు విరుద్ధంగా హాంగ్‌కాంగ్‌కు వజ్రాలు ఎగుమతి చేసిన కేసులో హైదరాబాద్‌లోని ఎంబీఎస్ జ్యూవెలర్స్‌కు ఈడీ భారీ జరిమానా విధించింది. ఫెమా నిబంధనల ఉల్లంఘన కింద ఎంబీఎస్ జ్యూవెలర్స్‌కు రూ.222కోట్లు, దాని డైరెక్టర్ సుఖేశ్ గుప్తాకు రూ.22కోట్లు జరిమానా విధించారు. సుఖేశ్ గుప్తాపై ఇదివరకే రూ.216 కోట్ల లావాదేవీల్లో కేసు నడుస్తోందని ఈడీ అధికారులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి హాంగ్‌కాంగ్‌కు వజ్రాలు ఎగుమతి చేసిన కేసులోనూ నిందితుడిగా ఉన్నారని పేర్కొన్నారు.
ఎంబీఎస్ జ్యూవెలర్స్‌కు రూ.222 కోట్ల జరిమానా విధించిన ఈడీ - తెలుగు వార్తలు
ఫెమా నిబంధనలు ఉల్లంఘించారంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు.. హైదరాబాద్‌లోని ఎంబీఎస్ బంగారు ఆభరణాల దుకాణానికి భారీ జరిమానా విధించారు. ఎంబీఎస్ జ్యూవెల్లర్స్పై రూ.222కోట్లు, దాని డైరెక్టర్ సుఖేశ్ గుప్తాకు రూ.22కోట్ల జరిమానా విధించారు.
ఎంబీఎస్ జ్యూవెలర్స్‌కు రూ.222 కోట్ల జరిమానా విధించిన ఈడీ
2013లో హాంగ్‌కాంగ్‌కు చెందిన లింక్ ఫై లిమిటెడ్ కంపెనీకి రూ.220 కోట్లు విలువ చేసే వజ్రాలను విక్రయించానని.... దానికి సంబంధించిన సొమ్ము రావాల్సి ఉందని సుఖేశ్ గుప్తా వెల్లడించినట్లు ఈడీ అధికారులు తెలిపారు. లింక్ ఫై కంపెనీతో... సుఖేష్ గుప్తాకు గల సంబంధాలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు.
ఇదీ చూడండి:ధరణిలో ఆస్తుల వివరాల నమోదుపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు