హైదరాబాద్‌లోని మన్సురాబాద్‌కు చెందిన బి.సత్యనారాయణ వనస్థలిపురంలోని బజాజ్ ఎలక్ట్రానిక్స్‌లో 2016 జూన్ 19న.. రూ.47,990తో ఫిలిప్స్ ఎల్ఈడీ టీవీ కొనుగోలు చేశారు. టీవీకి మూడేళ్ల వారంటీ ఉంటుందని షో రూం నిర్వాహకులు చెప్పారు. అయితే సరిగ్గా ఏడాదికి 2017 జూన్ 18న టీవీ ఆగిపోయింది. బజాజ్ షోరూంకు వెళ్లి ఫిర్యాదు చేశారు.
తమకు సంబంధం లేదు...
షోం రూం సిబ్బంది సూచనలతో టీవీని తయారు చేసిన పీఈ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌ను సంప్రదించారు. పీఈ ఎలక్ట్రానిక్స్ సర్వీస్ టెక్నీషియన్ వచ్చి టీవీ రిపేర్ చేశారు. మళ్లీ సరిగ్గా ఏడాదికి 2018 జూన్ 29న పాడయింది. సత్యనారాయణ బజాజ్ షోరూంకు వెళ్లి మళ్లీ ఫిర్యాదు చేశారు. పీఈ ఎలక్ట్రానిక్స్‌తో ప్రస్తుతం వ్యాపార సంబంధాలు లేవన్నారు. డీలర్ షిప్ లేనందున.. తమకు సంబంధం లేదని బజాజ్ షోరూం నిర్వాహకులు తెలిపారు.
వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు...
నేరుగా పీఈ ఎలక్ట్రానిక్స్‌ను సంప్రదిస్తే.. వారు స్పందించలేదని సత్యనారాయణ పేర్కొన్నారు. దీంతో టీవీ కోసం తాను చెల్లించిన డబ్బులు తిరిగి ఇచ్చేయాలని బజాజ్ షోరూం, పీఈ ఎలక్ట్రానిక్స్‌కు లీగల్ నోటీసు పంపించారు. చివరకు తనకు న్యాయం చేయాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు.