రాష్ట్రానికి ఆర్థిక సాయం చేసే విషయమై మరో బ్యాంకు కూడా ప్రపంచ బ్యాంకు దారిలోనే నడిచింది. ఏపీకి రుణంపై ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడుల బ్యాంకు వెనక్కి తగ్గింది. అమరావతి రాజధాని నిర్మాణ ప్రాజెక్టు రుణ ప్రతిపాదనను వెనక్కి తీసుకున్న ఏఐఐబీ... ప్రపంచ బ్యాంకు వైదొలిగిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. రాజధాని నిర్మాణానికి రూ.1400 కోట్లు ఇచ్చేందుకు గతంలో ఏఐఐబీ ముందుకొచ్చింది.
ఏపీకి రుణ ప్రతిపాదనపై వెనక్కి తగ్గిన ఏఐఐబీ - AP Capital Amaravathi
అమరావతి రాజధాని నిర్మాణ ప్రాజెక్టు రుణ ప్రతిపాదనను ఏఐఐబీ వెనక్కి తీసుకుంది. ప్రపంచ బ్యాంకు వైదొలిగిన తర్వాత ఏఐఐబీ ఈ నిర్ణయం తీసుకుంది.
ఏపీకి రుణ ప్రతిపాదనను వెనక్కి తీసుకున్న ఏఐఐబీ