ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అణగారిన వర్గాలకు అంబేడ్కర్ చేసిన మేలు మరువలేనిది: అచ్చెన్నాయుడు

డా.బి.ఆర్.అంబేడ్కర్ 64వ వర్ధంతిని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి...నివాళులర్పించారు.

Dr. BR Ambedkar 64th death anniversary
ఘనంగా అంబేడ్కర్ వర్దంతి

By

Published : Dec 6, 2020, 2:28 PM IST

అంబేడ్కర్ ఆశయ సాధన కోసం తెదేపా చిత్తశుద్ధితో పని చేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే తెదేపా ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేశారు. డా.బి.ఆర్.అంబేడ్కర్ 64వ వర్ధంతిని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్ చిత్రపటానికి తెదేపా రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్సీ అశోక్ బాబు పూల మాలలు వేసి నివాళులర్పించారు.

దశాబ్దాల తరబడి ఆర్ధిక, సామాజిక, రాజకీయ, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో అణచివేయబడిన వర్గాలకు అంబేడ్కర్ చేసిన మేలు అనిర్వచనీయమని నేతలు కొనియాడారు. రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి.. దళితులు, మైనార్టీలపై దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ వేధింపులు, దాడులకు గురవుతున్న దళిత, మైనార్టీ బాధితులకు తెదేపా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. దళిత ఓట్లతో గద్దెనెక్కి వారిపైనే దమనకాండకు దిగుతున్న జగన్ ప్రభుత్వానికి అంబేడ్కర్​కు నివాళులర్పించే అర్హత లేదని దుయ్యబట్టారు.

ABOUT THE AUTHOR

...view details