నిజం ఒప్పుకున్నందుకు జగన్కు కృతజ్ఞతలు: లోకేశ్ - Thanks to Jagan for doing so: Lokesh on twiteer
"పోలవరంలో అవినీతి అంటూనే టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన అంచనాలనే కేంద్రం ఆమోదించిందని తెలిపారు. చంద్రబాబు పాలనలో 5 లక్షల 60 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయని ఆధారాలతో సహా అసెంబ్లీలో చెప్పారు. తెదేపా పాలన బాగుందని ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలు జగన్ గారు!" - నారా లోకేశ్, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి
అలా ఒప్పుకున్నందుకు జగన్ గారికి కృతజ్ఞతలు: లోకేష్
సీఎం జగన్పై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. పాదయాత్రలో ముందుకి నడిచిన జగన్.. అధికారంలోకి వచ్చాక వెనక్కి నడుస్తున్నారని అన్నారు. 14 నెలల పాదయాత్రలో 900 హామీలిచ్చారని.. 14 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో 900 హామీలను అటకెక్కించారని దుయ్యబట్టారు. తమ పార్టీపై చేసిన అవినీతి ఆరోపణలు నిరూపించలేక.. మీ నోటితోనే తెదేపా పాలన అద్భుతం అని సభ సాక్షిగా ఒప్పుకోవడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు.