Dawat E Ramadan: దావత్-ఎ-రంజాన్ వేడుకల్లో సానియా మీర్జా - హైదరాబాద్‌లో దావత్ ఎ రంజాన్
Dawat E Ramadan : తెలంగాణలోని హైదరాబాద్ లంగర్‌హౌస్ మొఘల్‌కానాలా సమీపంలో ఏర్పాటు చేసిన రంజాన్ నైట్ బజార్‌ను టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మంగళవారం రాత్రి సందర్శించారు. ఈ సందర్భంగా మహిళలకు సంబంధించిన స్టాల్‌ను ఆమె ప్రారంభించారు. మీర్జా సోదరి ఆనం మీర్జా, క్రికెటర్ అజహరుద్దీన్ తనయుడు అసదుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
![Dawat E Ramadan: దావత్-ఎ-రంజాన్ వేడుకల్లో సానియా మీర్జా Dawat E Ramadan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15064559-885-15064559-1650430016303.jpg)
దావత్ -ఎ-రంజాన్ ప్రదర్శనను ప్రారంభించిన సానియా మీర్జా
Dawat E Ramadan : టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భాగ్యనగరంలో సందడి చేశారు. రంజాన్ పర్వదినం పురస్కరించుకుని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన దావత్ -ఎ-రంజాన్ ప్రదర్శనను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సానియాతో పాటు ఆమె సోదరి ఆనం మీర్జా, క్రికెటర్ అజహరుద్దీన్ తనయుడు అసదుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ రోజుల్లో అందరు పగలు విశ్రాంతి తీసుకుని రాత్రి సమయంలో షాపింగ్ చేయాలని సానియా అన్నారు. రంజాన్ షాపింగ్ కోసం ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.