ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

RTC: 314 అద్దె బస్సుల టెండర్లు ఖరారు: ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు - ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు

RTC: రాష్ట్రవ్యాప్తంగా 998 అద్దె బస్సులు తీసుకునేందుకు టెండర్లు పిలవగా, 419 బస్సులకు 823 బిడ్లు వచ్చాయని, వీటిలో ఇప్పటి వరకు 314 టెండర్లు ఖరారు చేసినట్లు ఆర్టీసీ ఎండీ సీహెచ్‌.ద్వారకా తిరుమలరావు తెలిపారు.

Tenders for rental buses in RTC are finalized says md dwaraka tirumal rao
314 అద్దె బస్సుల టెండర్లు ఖరారు

By

Published : Jun 10, 2022, 8:29 AM IST

RTC: రాష్ట్రవ్యాప్తంగా 998 అద్దె బస్సులు తీసుకునేందుకు టెండర్లు పిలవగా, 419 బస్సులకు 823 బిడ్లు వచ్చాయని, వీటిలో ఇప్పటి వరకు 314 టెండర్లు ఖరారు చేసినట్లు ఆర్టీసీ ఎండీ సీహెచ్‌.ద్వారకా తిరుమలరావు తెలిపారు. మిగిలిన బస్సులకు సంబంధించి బిడ్లువేసిన వారితో చర్చలు జరుపుతున్నామని, వీలైనంత తక్కువ ధరకే వాటిని తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు.

మద్యవిమోచన ప్రచార కమిటీ రూపొందించిన పోస్టర్లు, స్టిక్కర్లు, బోర్డులను ఎండీ, మద్యవిమోచన ప్రచార కమిటీ రాష్ట్ర ఛైర్మన్‌ లక్ష్మణరెడ్డితో కలిసి గురువారం ఆర్టీసీహౌస్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ ఈ నెలాఖరుకు తొలి విద్యుత్‌ బస్సు వస్తుందని, తిరుపతి-తిరుమల మధ్య నడుపుతామని తెలిపారు. సెప్టెంబరు ఆఖరుకు 49, ఏడాది చివరకు మరో 50 బస్సులు వస్తాయని వెల్లడించారు. బదిలీల విషయంలో ఆర్టీసీ సిబ్బంది ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్నారు.

మద్యవిమోచన ప్రచార కమిటీ రాష్ట్ర ఛైర్మన్‌ లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ.. ఏపీలో గతంకంటే దుకాణాలు తగ్గించి, ధరలు పెంచి మద్యం వినియోగం తగ్గించాలని ప్రయత్నించామని తెలిపారు. మన దేశంలో, రాష్ట్రంలోని అనుభవాలు చూశాక వెంటనే సంపూర్ణ మద్యనిషేధం సాధ్యంకాదనే విషయం అవగతమవుతోందని చెప్పారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details