ఆదిలాబాద్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు 10కి చేరాయని డీఎంహెచ్‌వో తెలిపారు. కరోనా బాధితులను హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాధితుల కుటుంబసభ్యులను క్వారంటైన్‌కు తరలించారు. ఆదిలాబాద్ జిల్లాలో మరో 25 మంది నివేదికలు రావాల్సి ఉందని డీఎంహెచ్‌వో తెలిపారు.
తెలంగాణ: ఆదిలాబాద్ జిల్లాలో 10... జగిత్యాలలో 2 కరోనా కేసులు
తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా 10, జగిత్యాలలో 2 కరోనా కేసులు నమోదయ్యాయి. బాధితుల కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించారు.
ten-coron-virus-positive-cases-registered-in-adilabad
జగిత్యాల జిల్లాలో ఇవాళ కొత్తగా 2 కేసులు నమోదయ్యాయి. బాధితులను క్వారంటైన్ నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు కలెక్టర్ తెలిపారు. జగిత్యాలలో క్వారంటైన్‌లో ఉన్న 73 మందిలో 43 మందికి నెగెటివ్ వచ్చినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో 190 కరోనా పాజిటివ్ కేసులు