తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా మంగళవారం.. విజయవాడలోని దుర్గామల్లేశ్వరస్వామిని రథంలో ఊరేగించారు. గతంలో ఈ రథానికి సంబంధించిన నాలుగు వెండి సింహాల బొమ్మల్లో మూడు చోరీకి గురైన విషయం విదితమే. ఆ తర్వాత చోరుడి నుంచి వెండిని స్వాధీనం చేసుకోవడంతో మళ్లీ కొత్తగా నాలుగు సింహాలను తయారు చేయించారు. వాటిని తొలిసారిగా తాత్కాలికంగా అమర్చి రథోత్సవం నిర్వహించారు. అయితే భద్రతా కారణాల నేపథ్యంలో ఊరేగింపు అనంతరం.. ఆ నాలుగు సింహాల బొమ్మలను తొలగించిన దేవస్థానం అధికారులు వాటిని లాకర్‌లో భద్రపరిచారు. రథాన్ని తిరిగి యథాస్థానంలో ఉంచారు.
దుర్గామల్లేశ్వరస్వామి రథంపై తాత్కాలికంగా వెండి సింహాల ఏర్పాటు - బెజవాడ దుర్గమ్మ
ఉగాది పర్వదినం సందర్బంగా.. విజయవాడ దుర్గమల్లేశ్వరస్వామి వార్లను రథంపై ఊరేగించారు. ఇందులో భాగంగా.. రథంపై వెండి సింహాలను తాత్కాలికంగా ఏర్పాటు చేసి రథోత్సవం నిర్వహించారు.
దుర్గామల్లేశ్వరస్వామి రథంపై తాత్కాలికంగా వెండి సింహాల ఏర్పాటు