ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దుర్గగుడి ఘాట్​రోడ్డు తాత్కాలికంగా మూసేస్తున్నాం: ఆలయ ఛైర్మన్ - దుర్గగుడి ఘాట్​రోడ్డు మూసివేత

దుర్గగుడి ఘాట్​రోడ్డుని తాత్కాలికంగా మూసేస్తున్నట్లు ఆలయ ఛైర్మన్ పైలా సోమినాయుడు స్పష్టం చేశారు. దసరా ఉత్సవాల కోసం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Durga temple Ghat road closing
దుర్గగుడి ఘాట్​రోడ్డు తాత్కాలికంగా మూసేస్తున్నాం

By

Published : Oct 13, 2020, 6:45 PM IST

దుర్గగుడి ఘాట్​రోడ్డు తాత్కాలికంగా మూసేస్తున్నాం

వర్షాలు తగ్గే వరకు విజయవాడ దుర్గగుడి ఘాట్​రోడ్డులోకి ఎవరిని అనుమతించమని ఆలయ ఛైర్మన్ పైలా సోమినాయుడు స్పష్టంచేశారు. కొండ చరియలు విరిగిపడిన ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన... అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇంజినీర్లతో చర్చించారు. వర్షం తగ్గిన తర్వాత ఘటనస్థలంలో పూర్తిస్థాయిలో ఇనుపకంచెను నిర్మిస్తామని తెలిపారు. దసరా ఉత్సవాల కోసం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details