ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

భక్తులు కనీస జాగ్రత్తలు పాటించాలి: మంత్రి వెల్లంపల్లి - మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు వార్తలు

ఈ నెల 8 నుంచి రాష్ట్రంలో ఆలయాలు తెరుచుకుంటాయని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు వెల్లడించారు. కంటైన్మెంట్ జోన్లలోని ఆలయాలు మాత్రం తెరిచేది లేదని అన్నారు. కరోనా దృష్ట్యా దేవాలయాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

minister vellampalli latest news
minister vellampalli latest news

By

Published : Jun 6, 2020, 12:06 PM IST

కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఈ నెల 8 నుంచి రాష్ట్రంలో ఆలయాలు తెరుచుకుంటాయని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ నెల 8, 9 తేదీల్లో అన్ని దేవాలయాల్లో ట్రయల్ ‌రన్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ రెండు రోజులు ఆలయ సిబ్బంది, స్థానికులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని చెప్పారు. ఈ నెల 10 నుంచి భక్తులందరినీ అనుమతిస్తామని వివరించారు. కంటైన్మెంట్ ప్రాంతాల్లోని ఆలయాలు తెరవకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

కరోనా కారణంగా ఆలయానికి వచ్చే భక్తులను నియంత్రించాల్సిన పరిస్థితి వచ్చిందని మంత్రి వెల్లంపల్లి అన్నారు. భక్తులు సైతం కనీస జాగ్రత్తలు పాటించాలని కోరారు. 70 ఏళ్లు పైబడినవారు, చిన్నపిల్లలను ఆలయాలకు తీసుకురావద్దని సూచించారు. క్యూలైనల్లో భౌతికదూరం పాటించాలని... మాస్కులు వేసుకోవాలని చెప్పారు. అనారోగ్య లక్షణాలతో ఉన్న వారు ఆలయాలకు రాకపోవడం మంచిదని మంత్రి వెల్లంపల్లి పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details